తెలంగాణ

telangana

ETV Bharat / state

రిజర్వేషన్​ అమలుపై హర్షం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం! - సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం

ఈడబ్ల్యూఎస్​ కోటా అమలుపై సీఎం కేసీఆర్​ నిర్ణయం పట్ల నాగోల్​లోని ఆల్​ ఇండియా ఆర్య వైశ్య సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం చిత్రపటానికి సంఘం ప్రతినిధులు పాలాభిషేకం చేశారు.

anointing with milk to cm kcr  photo
సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : Jan 22, 2021, 5:46 PM IST

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్​లో ఆల్ ఇండియా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తునట్లు సీఎం ప్రకటించారు. ఆయన నిర్ణయంపై సంఘం ప్రతినిధులు, తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు.

ఈ రిజర్వేషన్.. అర్హులకు ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీనివాస్​ గుప్తా అన్నారు. ప్రతినిధులు, మహిళలు తదితరులు సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు.

రిజర్వేషన్​ అమలుపై హర్షం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!

ఇదీ చదవండి:'తెలంగాణ పవర్​ప్లాంట్ రెండో దశకు శంకుస్థాపన అప్పుడే జరగాలి'

ABOUT THE AUTHOR

...view details