రంగారెడ్డి జిల్లా లక్డీకాపుల్లోని కలెక్టరేట్ ముట్టడికి పెద్దఎత్తున అంగన్వాడీలు వచ్చారు. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో అంగన్వాడీలు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి విషమించడం వల్ల వారిని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారంటూ అంగన్వాడీలు ఆరోపించారు.
డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీల పోరుబాట - anganwadi
సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఘర్షణకు దారి తీసింది. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం జరిగింది. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
అంగన్వాడీల నిరసన