తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈసారి గెలిపిస్తే పెండింగ్ పనులు పూర్తి చేస్తా: కొండా - TRS IN FEAR

కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి గడప గడపకు తిరుగుతూ హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు. తెరాసకు వేసే ప్రతి ఓటు భాజపాకే వెళ్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.

చేతి గుర్తుకే ఓటేసి నన్ను భారీ ఆధిక్యంతో గెలిపించాలి : కొండా

By

Published : Mar 29, 2019, 3:37 PM IST

తెరాసకు వేసే ప్రతి ఓటు భాజపాకే వెళ్తుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ రాజేంద్రనగర్​లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపా, తెరాస పార్టీలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యాయని మండిపడ్డారు.పెండింగ్ పనులన్నీ ఈసారి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా తెరాస కండువా కప్పడంలో ఆంతర్యం ఏమిటని కొండా ప్రశ్నించారు. చేతి గుర్తుకే ఓటేసి తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details