విదేశాల నుంచి వచ్చి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా.. పదిరోజులుగా బంధువు ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తిని రాపిడ్ యాక్షన్ టీం అధికారులు రంగారెడ్డి జిల్లా షాదనగర్లో పట్టుకున్నారు. పట్టణంలోని లక్ష్మీ నరసింహా కాలనీలో బంధువుల వద్ద నివాసం ఉంటున్నాడని సమాచారం అందుకున్న అధికారులు అతడిని పట్టుకున్నారు.
విదేశాల నుంచి వచ్చాడు.. రహస్యంగా ఉంటున్నాడు - షాద్‌నగర్‌లో రహస్యంగా ఉంటోన్న ఎన్నారై
విదేశాల నుంచి వచ్చాడు. ఇంటికెళ్ల కుండా బంధువుల వద్దే ఉంటున్నాడు. అధికారులు అతడిని గుర్తించారు. క్వారంటైన్‌కు తరలించారు.
విదేశాల నుంచి వచ్చి రహస్య నివాసం
ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 21న దక్షిణాఫ్రికా నుంచి వచ్చి సొంత ప్రాంతానికి వెళ్లకుండా బంధువు ఇంట్లో ఉంటున్నాడు. తాను వచ్చిన విషయం ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. కొత్తగా కనిపించిన అతడిని గుర్తించి స్థానికులు ఆరా తీయగా.. విదేశాల నుంచి వచ్చినట్లు తెలిసింది. ఇంటి పక్కనే ఉండే డాక్టర్ విజయకుమార్ ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రాపిడ్ యాక్షన్ టీం అతడిని విచారించి క్వారంటైన్‌కు తరలించారు.