Drunk And Drive Hulchul: హైదరాబాద్ చంపాపేటలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. శుక్రవారం రాత్రి ఐఎస్ సదన్, చంపాపేట మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అటుగా వచ్చిన ఓ యువకుడి బండిని ఆపారు. అధిక మద్యం సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వారితో వాగ్వాదానికి దిగాడు మందుబాబు. తనను వదిలిపెట్టాలని.. ఇంత సమయం వరకు పోలీసులు ఉండకూడదని చెప్పుకుంటూ నానా హంగామా చేశాడు.
Drunk And Drive Hulchul: డ్రంక్ అండ్ డ్రైన్ తనిఖీల్లో ల్యాబ్ టెక్నీషియన్ హల్చల్ - Drunk And Drive Test At Champapet
Drunk And Drive Hulchul: ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తనను వదిలిపెట్టాలని.. ఇంత సమయం వరకు పోలీసులు ఉండకూడదని చెప్పుకుంటూ నానా హంగామా చేశాడు.
మందుబాబు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. అతనితోపాటుగా బైక్‌పై మరో వ్యక్తి భాస్కర్ ఉన్నట్లుగా తెలిపారు. పోలీసులతో సందీప్ గొడవ పడతుండగా.. భాస్కర్ అతనికి ప్రోత్సహించాడని పేర్కొన్నారు. అతను సైతం పూటుగా మద్యం సేవించినట్లు వివరించారు. వీరి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీరిపై ట్రాఫిక్ పోలీసులు సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా... కేసు నమోదైంది.
ఇదీ చదవండి: