తెలంగాణ

telangana

ETV Bharat / state

త్రీడీ ఎఫెక్ట్‌లో కనువిందు చేస్తున్న శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహం - ts news

Statue of Equality: ముచ్చింతల్​లో రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రామానుజాచార్యుల భారీ విగ్రహం విద్యుదీపాలతో వెలిగిపోతోంది. విగ్రహం మీద పడే విధంగా ఏర్పాటు చేసిన త్రీడీ ఎఫెక్ట్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

త్రీడీ ఎఫెక్ట్‌లో కనువిందు చేస్తున్న శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహం
త్రీడీ ఎఫెక్ట్‌లో కనువిందు చేస్తున్న శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహం

By

Published : Jan 30, 2022, 5:17 AM IST

త్రీడీ ఎఫెక్ట్‌లో కనువిందు చేస్తున్న శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహం

Statue of Equality: హైదరాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్​లో రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి వేడుకలు ప్రారంభంకానున్నాయి. పరిసర ప్రాంతాల్ని అందంగా అలకరించారు. రామానుజాచార్యుల భారీ విగ్రహం విద్యుదీపాలతో వెలిగిపోతోంది. విగ్రహం మీద పడే విధంగా ఏర్పాటు చేసిన త్రీడీ ఎఫెక్ట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీరామానుజచార్యుల నుదుటిపై, భుజాలపై నామాలు.. త్రీడీ ఎఫెక్ట్‌లో మెరిసిపోతున్నాయి. త్రీడీలో ఒక్కో రంగులో విగ్రహం కనువిందు చేస్తోంది. ధ్యాన ముద్రలో ఉన్న శ్రీరామనుజచార్యుల ముందు హోమం మంటలు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరగా మెరుపులతో కూడిన వివిధ త్రీడి ఆకృతులు విగ్రహంపై పడడంతో రామానుజాచార్యులు బంగారు వర్ణంలో కనిపిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details