SP Balu: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయనే మనమంతా ఆప్యాయంగా పిలుచుకునే ఎస్పీ బాలు. అసమాన ప్రతిభా పాటవాలతో వేలాది పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు. తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత విద్వాంసుడు. సంగీత ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సంగీత సామ్రాట్ మననుంచి దూరమైనా పాట రూపంలో చిరంజీవిగా నిలిచే ఉంటారు.
ఎస్పీ బాలుని స్మరించుకున్న సంగీత ప్రియులు - బాలు జయంతి
SP Balu: సినీ సంగీత వినీలాకాశంలో బాలసుబ్రహ్మణ్యం గాత్రం చిరకాలం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఆయన పాట వస్తుంటే ప్రతి మనసు పులకరించిపోతుంది. జూన్ 4న(శనివారం) ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్లో జయదేవ్ సంగీత సమితి, ఎల్వీబీ మ్యూజికల్ గ్రూప్ వారు సంయుక్తంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
జూన్ 4న శనివారం ఎస్పీబీ 76వ పుట్టినరోజు సందర్భంగా జయదేవ్ సంగీత సమితి, ఎల్వీబీ మ్యూజికల్ గ్రూప్ వారు సంయుక్తంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సూర్యకాలనీలో శనివారం సాయంత్రం ప్యారడైజ్ హోమ్స్-మోడీ బిల్డర్స్ వేదికగా 'సినీ సంగీత విభావరి' పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనను, ఆయన పాటల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, గాయనీ గాయకులు, గేయ రచయితలు, సంగీత ప్రియులు భారీగా హాజరై గాన గంధర్వుడిని స్మరించుకున్నారు.
ఇవీ చదవండి:తెలుగు సినిమాల జోరు.. బాక్సాఫీస్ కళకళ.. వసూళ్లలో సూపర్ హిట్టు!