తెలంగాణ

telangana

'రామోజీ గ్రూప్‌ సంస్థల్లో భద్రతా చర్యలు అభినందనీయం'

By

Published : Mar 3, 2020, 9:01 PM IST

Updated : Mar 3, 2020, 11:20 PM IST

రామోజీ గ్రూప్‌ సంస్థల్లో సిబ్బంది భద్రతా చర్యలు అభినందనీయమని రాష్ట్ర కర్మాగారాల డైరెక్టర్‌ బి.రాజగోపాల్‌రావు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని సూచించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్న 49వ జాతీయ భద్రతా వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

49th national safety day
49th national safety day

'రామోజీ గ్రూప్‌ సంస్థల్లో భద్రతా చర్యలు అభినందనీయం'

ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడే... ప్రమాదాలు జరగకుండా నివారించగలమని రాష్ట్ర కర్మాగారాల డైరెక్టర్‌ బి.రాజగోపాల్‌రావు పేర్కొన్నారు. నిర్మాణం, విద్యుత్‌, ఉత్పత్తి తదితర రంగాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు... హక్కులతో పాటు భద్రతాపరమైన బాధ్యతలు కూడా తెలుసుకోవాలని సూచించారు. సిబ్బంది భద్రత కోసం రామోజీ గ్రూప్‌ సంస్థలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తున్న 49వ జాతీయ భద్రతా వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జెండా ఆవిష్కరించి... సిబ్బందితో భద్రతా ప్రమాణం చేయించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్‌ చీఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ మోహన్‌బాబు, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫిసర్‌ జీవీ ప్రసాద్‌తో పాటు ఈనాడు ఎండీ కిరణ్‌, ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డీఎన్​ ప్రసాద్‌ సహా రామోజీ గ్రూప్‌ సంస్థల మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఏ.గోపాల్‌రావు, డీహెచ్​ఎల్​ ఉపాధ్యక్షుడు సుధాకర్‌బాబు, ఫిల్మ్​సిటీ డైరెక్టర్‌ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంస్థలో భద్రత ప్రమాణాలు పాటించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయరాదు: ఏజీ

Last Updated : Mar 3, 2020, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details