తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగారెడ్డిలో తుది విడత పోరుకు రంగం సిద్ధం

తుది విడత పరిషత్​ పోరుకు సర్వం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల్లో మంగళవారం జరగనున్న పోలింగ్​కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

తుది విడత పోరుకు రంగం సిద్ధం

By

Published : May 13, 2019, 11:43 AM IST

రంగారెడ్డి జిల్లాలో మూడో విడత ఎన్నికల కోసం అధికారులు రంగం సిద్ధం చేశారు. మంగళవారం నాడు కందుకూరు, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ డివిజన్లలోని 66 ఎంపీటీసీలు, 6 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 244మంది ఎంపీటీసీ, 32 మంది జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. లక్షా 94వేల 979 మంది ఓటర్ల కోసం 381 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 19 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం పోలింగ్ 4 గంటలకే ముగుస్తుంది. ఈ ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి విడతలో బ్యాలెట్ తారుమారైన... మొయినాబాద్ మండలం అజీజ్​నగర్ స్థానానికి కూడా రేపు పోలింగ్ నిర్వహించనున్నారు.

తుది విడత పోరుకు రంగం సిద్ధం

ఇవీ చూడండి: రోడ్డుపై మతిస్తిమితం లేని వ్యక్తి హల్​చల్​

ABOUT THE AUTHOR

...view details