నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దీక్ష చేయనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం కోనరావుపేట మండలం గొల్లపల్లె గ్రామంలో షర్మిల నిరాహార దీక్ష చేస్తారని.. ఆ పార్టీ వెల్లడించింది. ఉదయం 6 గంటలకు లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి.. దీక్ష స్థలికి చేరుకుంటాని తెలిపింది.
రేపు సిరిసిల్ల నియోజకవర్గం గొల్లపల్లెలో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష - telangana latest news
సిరిసిల్ల నియోజకవర్గంలోని గొల్లపల్లెలో రేపు వైఎస్ఆర్టీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీనే ప్రధాన అజెండాగా.. ప్రతి మంగళవారం నిరుద్యోగుల వారం పాటిస్తున్న షర్మిల.. ఇప్పటికే పలు జిల్లాలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు.
ys sharmila hunger protest
నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా పాటిస్తామని చెప్పిన షర్మిల.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో దీక్షలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీచూడండి: YS SHARMILA: 'నిరుద్యోగుల చావులన్నీ ప్రభుత్వ హత్యలే..'
Last Updated : Aug 2, 2021, 9:06 PM IST