రాజన్న సిరిసిల్ల జిల్లా మన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు జలాశయంలో జలసవ్వడి నెలకొంది. 2016 సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షానికి మధ్యమానేరు మట్టికట్ట కొట్టుకు పోయిన సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును సందర్శించడమే కాకుండా... గుత్తేదారులను మార్చి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం వల్ల లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపు నుంచి ఎల్లంపల్లి జలాలు వడివడిగా వచ్చి చేరుతున్నాయి. మధ్యమానేరు ప్రాజెక్టు.. దిగువ మానేరు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్లకు కీలకంగా మారింది. తాజా పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
మధ్యమానేరుకు జలకళ - లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపు
రాజన్న సిరిసిల్ల మధ్యమానేరు జలకళను సంతరించుకొంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం వల్ల లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపు నుంచి ఎల్లంపల్లి జలాలు వచ్చి చేరుతున్నాయి.
మధ్య మానేరుకు జలకళ
ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి