రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని చింతలకుంటపల్లి గ్రామస్థులు... భాజపా నాయకుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వర్షంలో రోడ్డుపై బైఠాయించారు. వర్షాకాలంలో మండలకేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి వెళ్లాలంటే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదేళ్లుగా తప్పని తిప్పలు...
ఐదేళ్లుగా రాస్తారోకోలు, ధర్నాలు చేయగా రెండున్నరేళ్ల క్రితం ప్రజా ప్రతినిధులు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరైనా పనులు ప్రారంభించకపోవడం వల్ల మళ్లీ తాము ధర్నాకు దిగినట్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదని... ఆటోవాళ్లు రోడ్డు లేనందున ఇటువైపు రావడానికే జంకుతున్నారన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిఃకడుపునొప్పి అని వెళ్తే 'కండోమ్' రాసిచ్చాడు