రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. అద్దాల మండపంలో యాగశాల ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చన, నిర్వహించారు. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజేశ్వర్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
వేములవాడలో వరుణ యాగం - varuna yagam
వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. అద్దాల మండపంలో యాగశాల ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
వరుణ యాగం
ఇవీ చూడండి: బురద మడుగులో 'కేసార్డ్ ఓంజీ' ఉత్సవాలు