ఎన్నికల్లో ఇచ్చిన ఆసరా పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆసరా లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. పింఛన్ల వయసు సడలింపు కూడా ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. మండేపల్లిలో ఇప్పటికే 1320 రెండు పడకగదుల ఇళ్లు పూర్తి చేశామన్న కేటీఆర్... నమ్మకం లేకపోతే బస్సులు పెడతాం.. వెళ్లి చూడొచ్చన్నారు. ఆడ బిడ్డలకు వడ్డీ లేని రుణం కింద ఇవ్వాల్సిన 65 కోట్ల చెక్కులు త్వరలో అందచేస్తామని హామీ ఇచ్చారు.
సిరిసిల్లలో ఊహించని అభివృద్ధి: కేటీఆర్ - ktr
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సిరిసిల్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పింఛన్ పెంపు హామీ నిలబెట్టుకున్నామని చెప్పారు.
కేటీఆర్
ఇదీ చూడండి:అన్నదాతకు అండగా... ప్రత్యామ్నాయాల దిశగా..