తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగే సమీక్ష సమావేశంలో అయినా కేసీఆర్ తీపి కబురు చెప్తారన్న ఆశతో ఉన్నామన్నారు.
సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్తారన్న ఆశతో...
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ... రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.
సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్తారన్న ఆశతో...