రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమైనా ఆలోచించిందా అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పుట్టుక ముందు నుంచి చావు వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి.. సిరిసిల్లలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. మార్చిలో మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు పూర్తి చేయాలని అన్నారు.
రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్
కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో తెరాస సభ‌్యత్వ నమోదును ప్రారంభించిన కేటీఆర్.. ఈనెలాఖరులోపు ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు.
తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్
అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన పార్టీని తరిమికొట్టిన పార్టీ తెరాస అని తెలిపారు. మతం, కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్, భాజపా కార్యకర్తలకు కూడా రైతుబంధు, కల్యాణలక్ష్మి అందుతోందని వెల్లడించారు.
- ఇదీ చూడండి :హిందువులంటే భాజపా నేతలేనా..? : తలసాని