రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటనలు చేయడం హాస్యాస్పదమన్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించండి: పొన్నం ప్రభాకర్ - పొన్నం ప్రభాకర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులు ఉండి రైతులకు ఏమీ చేయడం లేదని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను పరిష్కరించండి: పొన్నం ప్రభాకర్
కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఒక్కో లారీకి 25 వేల చొప్పున అన్నదాతలు మోసపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.