రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో పడిన పిడుగు గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. నివాసస్థలాలకు దగ్గర్లో ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడటం వల్ల ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
కుండపోతగా వర్షం... నివాసప్రాంతాల్లో పిడుగులు - rajanna siricilla
ఉదయం నుంచి కమ్ముకున్న మేఘాలు ఒక్కసారి విరిగిపడ్డట్టుగా భారీ వర్షం... అంతలోనే పెద్దపెద్ద శబ్దాలతో పిడుగులు... చెలరేగిన మంటలతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామస్థులు వణికిపోయారు.
thunder storms in tadagonda village
నివాసాలకు సమీపంలో మంటలు చెలరేగగా... స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని కుండపోతగా వర్షం కురిసింది. భారీ శబ్దాలతో ఎత్తైన ప్రదేశాల్లో పిడుగులు పడ్డాయి. గ్రామంలో రోజువారీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.