రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దలింగాపూర్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంట్లో నుంచి మహిళలు, యువతులు నెత్తిన బోనంతో అమ్మ వారి సన్నిధికి చేరుకున్నారు. బైండ్ల పూజారుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళతో గ్రామస్థులు ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లి బోనాలు సమర్పించారు.
ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు - PEDDALINGAPUR
గ్రామ దేవత పోచమ్మ తల్లికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోనాలు ఘనంగా సమర్పించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
బైండ్ల పూజారుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళతో ఊరేగింపు