లక్ష్యం@ 2లక్షల మొక్కలు - రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా ఎస్పీ రాహుల్‌రెడ్డి ఆదేశాల మేరకు మండేపల్లి మానేరు పరివాహక ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఎస్సై శేఖర్ అన్నారు.
target for police department in rajanna siricilla district is two lakhs plants
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి మానేరు పరివాహక ప్రాంతంలో మొక్కలు నాటారు. ఐదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో సుమారు పదివేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తంగళ్లపల్లి ఎస్సై శేఖర్ తెలిపారు. పోలీస్ శాఖ తరఫున 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా... మండేపల్లి సర్పంచ్ శివజ్యోతి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు స్వప్నలతో కలిసి ఇప్పటివరకు రెండు వేల మొక్కలు నాటామని తెలిపారు.
- ఇదీ చూడండి : సమీక్ష: రైతును గెలిపించే క్రికెటర్ కౌసల్య