రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాలకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు ఆందోళన నిర్వహించారు. తమ ఫొటోలు ఫ్లెక్సీల్లో లేవని గొడవకు దిగారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో మద్దతు తెలిపిన వారి ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీలో పొందుపరిచి మిగతావారివి వదిలేశారంటూ మిగతా సభ్యులు నిరసనకు దిగారు. ఎంపీపీ వెంకటరమణారెడ్డి నచ్చచెప్పడం వల్ల వారు శాంతించారు.
మద్దతిస్తేనే... ఫ్లెక్సీల్లో ఫొటోలు వేస్తారా? - mptc
ఎంపీపీ ఎన్నిక సమయంలో మద్దతు తెలిపిన వారి ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీలో పొందుపరిచారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో గురువారం ఎంపీటీసీలు ఆందోళనకు దిగారు.
ఎంపీటీసీలు ఆందోళన
ఇవీ చూడండి: పుర'పోరు'కు రంగం సిద్ధం