రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం గంభీర్పూర్లో మామిడి, పసుపు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్(Special Food Processing Zone) ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు... మంత్రి కేటీఆర్(KTR)కు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి చెందిన కథలాపూర్ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రగతిభవన్‌లో మంత్రిని కలిసి... అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను కేటీఆర్‌కు అందించారు.
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌పై విజ్ఞప్తి... సానుకూలంగా స్పందించిన కేటీఆర్ - vemulawada news
వేములవాడ నియోజవర్గంలోని గంభీర్పూర్లో మామిడి, పసుపు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్(Special Food Processing Zone) ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్(KTR)కు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్ర ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. గంభీర్పూర్లో 344 ఎకరాల్లో మామిడి, పసుపు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్(Special Food Processing Zone)ఏర్పాటు చేయాలని విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఈ జోన్ వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని మంత్రికి వివరించారు. జగిత్యాల జిల్లాలో 36 వేల ఎకరాల్లో మామిడి పండుతోందని.. తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉన్నామని... పసుపు 22 వేల ఎకరాల్లో పండిస్తూ రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ రెండు ప్రధాన పంటల ప్రాసెసింగ్, శుద్ధి స్థానికంగానే జరిగితే రైతులకు గిట్టుబాటు, వ్యవసాయ ఆదాయానికి భరోసా, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్... ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:CM KCR: సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్