రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నాంపెల్లి బాలరాజ్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. బాలరాజ్‌కు భార్య స్రవంతి ఇద్దరు కుమారులు హర్షవర్ధన్, కృష్ణ వర్ధన్ ఉన్నారు. కుటుంబ పోషణ, చిన్నారుల ఆలనాపాలన భారంగా మారడం వల్ల దాతలసాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.
విధుల్లోనే కాదు మానవత్వంలోనూ మనసున్న ఎస్పీ - రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ దాతృత్వం
ఆపదలో ఉన్న వారికి నేనున్నా అంటూ అండగా నిలుస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. రాజన్నపేటలో ఇంటిపెద్దను కోల్పోయి ఇద్దరు చిన్నారులతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
విధుల్లోనే కాదు మానవత్వంలోనూ మనసున్న మారాజన్న ఎస్పీ
చిన్న పిల్లలను ఆదుకోవడానికి తనవంతు సాయంగా రూ. 50 వేలు అందించారు. దానితోపాటు 100 కిలోల బియ్యం, వారు కట్టుకోడానికి బట్టలు అందజేశారు. వారికి అన్నివేళలా అండగా ఉంటానని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ బన్సీలాల్, ఎల్లారెడ్డిపేట ఎస్సై వెంకటకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీచూడండి:వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే.