రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లోని సర్జిపూల్ పనులను ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. పనుల వివరాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌తో కలిసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతగిరి ప్రాజెక్ట్ వద్దగల సర్జిపూల్ పనులు వేగవంతంగా కొనసాగించేందుకు తీసుకున్న చర్యలను అధికారులు ఆమెకు వివరించారు. సమన్వయంగా రాణిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని అధికారులను స్మితా సబర్వాల్ ఆదేశించారు.
సర్జిపూల్ పనులను పర్యవేక్షించిన స్మితాసబర్వాల్ - latest news of smita sabarwal visit to surgipol in sirisilla
రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్‌లోని కొనసాగుతున్న సర్జిపూల్ పనులను స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. పనులను వేగవంతంగా సమన్వయంతో చేయాలని అధికారులను ఆదేశించారు.
సర్జిపూల్ పనులను పర్యవేక్షించిన స్మితాసబర్వాల్