'ఐదేళ్లలో అంబరమెక్కిస్తా' - రాయిని చెరువు
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటన ఉత్సాహంగా సాగింది. ముందుగా పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయిని చెరువు శిఖం భూమి నుంచి పేదల కోసం 152 ఎకరాలు పంపిణీ చేశారు. వచ్చే ఐదేళ్లలో సిరిసిల్లను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
అందరికి సొంత ఇళ్లు..
అందరికీ సొంత ఇళ్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అర్హులైన వారందరికీ మంజూరుచేస్తామని స్పష్టం చేశారు. ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఎవ్వరికీ డబ్బులివ్వొద్దని సూచించారు.సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేకగుర్తింపు తీసుకొస్తామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.