రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి తెరాస పార్టీ తరపున పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు పంపిణీ చేశారు. వైరస్ వ్యాప్తి కట్టడిలో వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల సేవలు మరువలేనివని, ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు చేస్తున్న వారి గొప్పదనం వెలకట్టలేమని జెడ్పీ ఛైర్ పర్సన్ నేలకొండ అరుణ అన్నారు. వైద్య సిబ్బంది ఆరోగ్య భద్రతకు మంత్రి కేటిఆర్ సూచనలతో జిల్లా పార్టీ తరపున పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు పంపిణీ చేశామని తెలిపారు.
సిరిసిల్ల ఆస్పత్రి సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ - Siricilla district news
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో విధుల్లో నిర్వహిస్తున్న సిబ్బందికి జెడ్పీ ఛైర్ పర్సన్ నేలకొండ అరుణ పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు పంపిణీ చేశారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న వైద్య సిబ్బందిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆమె అన్నారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు, ప్రభుత్వ సూచనలు పాటించాలని అన్నారు. కరోనా వైరస్ కట్టడికి సేవలందింస్తున్న వారికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, వేములవాడ రూరల్ జెడ్పీటీసీ ఏశా వాణి, డీఎంహెచ్ఓ సుమన్ రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రావు, తెరాస జిల్లా నాయకులు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..