సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్లో నిర్వహించిన జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలను ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. స్వరాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి 45 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీలకు పరిహారం కింద ఇచ్చామని తెలిపారు. ఎస్సీ. ఎస్టీ కేసులకు సంబంధించి 60 నుంచి 90 రోజుల లోపు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్టు చేయాలని ఆయన అన్నారు. డంపింగ్ యార్డులు, రైతు వేదికల కోసం ఎస్సీ భూములు తీసుకుంటున్నారని దానికి బదులుగా వేరే భూమిని వారికి కేటాయించాలన్నారు. పేదవారికి తక్షణ న్యాయం సహాయం అందించాలని సూచించారు. కుల ధ్రువీకరణ పత్రాలకు అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకుంటే.. రెవెన్యూ శాఖ ఆలస్యం చేయకుండా వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేజీ టు పీజీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్నదని, ఈ అంశం మీద ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
సిరిసిల్లలో పర్యటించిన.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ - సిరిసిల్ల మున్సిపాలిటీ
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని.. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్లో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సిరిసిల్లలో పర్యటించిన.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్!
రాజన్న సిరిసిల్ల జిల్లా కరోనా కేసులు లేని జిల్లాగా అగ్రభాగంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, కమిషన్ సభ్యులు రామ్బాల్ నాయక్, విద్యాసాగర్, అదనపు కలెక్టర్ అంజయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.సత్య ప్రసాద్, ఆర్డీవో శ్రీనివాస్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి