రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ తామర కాండం నుంచి తీసిన నారతో చీరను తయారు చేశారు. మూడ్రోజుల్లో తామర నారతో, 50 శాతం పట్టును ఉపయోగించి మరమగ్గంపై నేశారు. ఈ చీరను శనివారం ప్రదర్శించారు.
తామర నారతో చీర.. ఆకట్టుకున్న అద్భుత ప్రదర్శన
తామర కాండం నుంచి తీసిన నారతో చీరను తయారుచేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన కార్మికుడు నల్ల విజయ్. మూడు రోజుల్లో తామర నారతో 50 శాతం పట్టును ఉపయోగించి మరమగ్గంపై నేశారు.
తామర నారతో చీర
గతంలో ఆయన కుట్టులేని జాతీయ జెండా, మూడు కొంగుల చీర, దబ్బనంలో దూరే చీర, వెండి జరీతో చీర, అరటి నారతో శాలువాను తయారు చేశారు. సీఎం కేసీఆర్ చేతులమీదుగా చేనేత కళారత్న ఉగాది పురస్కారం అందుకున్నారు. తెలంగాణ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరు మూడుసార్లు నమోదైంది. తామర నారతో చీర తయారీకి శ్రీవిహాన్ టెక్స్‌టైల్ యజమానులు రూ.15 వేల ఆర్థిక సాయం అందించారని విజయ్ తెలిపారు.