తెలంగాణ

telangana

ETV Bharat / state

RS Praveen kumar: 'బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం' - RS Praveen kumar in rajanna sircilla dist

RS Praveen kumar: నేరెళ్ల బాధిత కుటుంబాలను రాష్ట్ర బీఎస్పీ సమన్వయకర్త ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఆయన పర్యటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు.

RS Praveen kumar
RS Praveen kumar

By

Published : Feb 27, 2022, 8:23 PM IST

RS Praveen kumar: ఐదేళ్ల క్రితం జరిగిన నేరెళ్ల ఘటన బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర బీఎస్పీ సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్​​కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. నేరెళ్లకు చెందిన హరీశ్, బానయ్య కుటుంబాలను కలిసి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బాధితుడు కోల హరీశ్ చేస్తున్న పోరాటానికి తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ఈ ఘటనను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి పూర్తిస్థాయిలో బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. నేరెళ్లలో ఎస్సీలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నేరెళ్లలో ఇసుక దందా వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే అడ్డుకుంటే హింసిస్తారా?. ఆగ్రహంతో కొందరు ఒక లారీని దగ్ధం చేస్తే ఎలాంటి సంబంధం లేని యువకులను 2017లో రాత్రికి రాత్రే పోలీసులు మఫ్టీలో తీసుకునిపోయి ఎనిమిది రోజులపాటు హింసించారు. బాధితుల్లో కోల హరీశ్, బానయ్యతో పాటు మరికొందరు ఉన్నారు. పోలీసుల చర్యతో మాజీ సర్పంచ్ వికలాంగుడిగా మారిపోయాడు. విపరీతంగా పోలీసులు వీరిని కొట్టారు. రాత్రికి రాత్రే వీళ్లందరిని బెదిరించారు. సీఎం, కేటీఆర్​ ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నారు.' - ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details