గత నెలలో వర్టికల్ వారిగా అత్యుత్తమ ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు ఇచ్చినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించాలని సూచించారు.
ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసాపత్రాలు - తెలంగాణ వార్తలు
కష్టపడి అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి పోలీసు డిపార్ట్మెంట్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గత నెలలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ధ్రువపత్రాలు అందించారు.
తెెలంగాణ తాజా వార్తలు
రిసెప్షన్, బ్లూకల్డ్స్, సెక్షన్ ఇంఛార్జ్, రైటర్, ఇన్వెస్ట్గేషన్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ, సమన్స్ ఇలా పది మందికి సర్టిఫికెట్లు అందించారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.
ఇదీ చూడండి:కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని