తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​కు అరుదైన అవకాశం - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ కృష్ణ భాస్కర్​కు అరుదైన అవకాశం దక్కింది. ప్రధానమంత్రి ఎక్సలెన్స్​ అవార్డులకు సంబంధించిన సవరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 15 జిల్లాలకు మాత్రమే ఆహ్వానం పంపింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​కు అరుదైన అవకాశం
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​కు అరుదైన అవకాశం

By

Published : Jan 29, 2020, 10:48 AM IST

ప్రజా పరిపాలనలో అత్యున్నత ఫలితాలు చూపినందుకు అఖిల భారత సర్వీసు అధికారులకు ప్రధాన మంత్రి ఎక్సలెన్స్ అవార్డులను ఏటా సివిల్ సర్వీసెస్ దినోత్సవం రోజున ఇస్తోంది. అయితే 2020కి గాను ప్రధానమంత్రి అవార్డులకు సంబంధించిన సవరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేవలం 15 జిల్లాల కలెక్టర్​లకు ఆహ్వానం పంపింది. ఈనెల 28న మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. దక్షిణ భారతదేశం నుంచి 4 జిల్లాల కలెక్టర్​లకు ఆహ్వానం అందింది.

అరుదైన అవకాశం:

తెలంగాణ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్​కు ఈ అరుదైన అవకాశం దక్కింది. కొత్త జిల్లాల పరంగా చూసుకుంటే ఈ అవకాశం దక్కించుకున్న ఏకైక జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కావడం విశేషం. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యాభివృద్ధికి సంబంధించి ప్రధానమంత్రి అవార్డులలో చేపట్టాల్సిన సవరణలు, సూచనలను పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు.

మిగిలిన జిల్లాలు:

మిగిలిన రాష్ట్రాల నుంచి విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్​), సోలాన్ ( హిమాచల్ ప్రదేశ్ ), ఉడుపి ( కర్ణాటక ),ఈస్ట్ కాసి హిల్స్, షిల్లాంగ్(మేఘాలయ ), బికానర్ ( రాజస్థాన్ ), జాన్ పూర్ (ఉత్తర ప్రదేశ్ ), బరసాత్ నార్త్ 24( పశ్చిమ్ బంగా ), ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ ( మణిపూర్ ), నాగాన్ ( అస్సాం ), బంకా (బిహార్ ), పత్తనమ్ తిట్ట( కేరళ ), బనస్‌కాంతా (గుజరాత్ ) జిల్లాల కలెక్టర్​లు ఉన్నారు.

ఇవీ చూడండి:కరీంనగర్ మేయర్​ అభ్యర్థిని ఖరారు చేసిన తెరాస

ABOUT THE AUTHOR

...view details