తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో హెల్మెట్​ వినియోగంపై అవగాహన

ఈవ్ టీజింగ్, ఏటీఎంల వద్ద జరుగుతున్న మోసాలు,  సైబర్ నేరాలు, శిరస్త్రాణం వినియోగంపై ఎప్పటికప్పుడు ప్రజలు, అవగాహన కలిగి ఉండాలని  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

సిరిసిల్లలో శిరస్త్రాణం వినియోగంపై అవగాహన

By

Published : Aug 26, 2019, 7:05 PM IST

సిరిసిల్లలో హెల్మెట్​ వినియోగంపై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో షీ టీం, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగం, డయల్​ 100 నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు శిరస్త్రాణం లేకపోవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్​ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. కళాశాలల్లో, బస్టాండ్​లలో యువకులు... మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. ఈవ్​టీజింగ్​కు పాల్పడినా... 100 నంబర్​కు డయల్​ చేయాలని తెలిపారు. పోలీసులు వెంటనే వచ్చి సత్వర న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

srcl

ABOUT THE AUTHOR

...view details