రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నెల 22న నిర్వహించుకునే వినాయకచవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు మొహరం వేడుకలకు కూడా నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయని అన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలందరు ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యమైన కూడళ్లలో విగ్రహాల ఏర్పాటు నిషేధమని... అదే విధంగా మొహరం పండుగను కూడా ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలన్నారు.
జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదు: జిల్లా ఎస్పీ
కరోనా నేపథ్యంలో వినాయక నవరాత్రుల కోసం మండపాల ఏర్పాటు అనుమతించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ప్రజలందరూ ఎవరి ఇంటి వద్ద వారే ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు మొహరం వేడుకలను కూడా ఇంట్లోనే జరుపుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
కొవిడ్-19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరు తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఎవరైనా ఈ సూచనలను ఉల్లంఘించినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. రాబోవు గణేష్, మొహరంల సందర్భంగా వివిధ మతాల విశ్వాసాలకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై చట్టపరంగా కేసులను నమోదుచేస్తామని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: శాంతిస్తున్న ఉగ్ర గోదారి.. 51.5 అడుగులకు చేరిన నీటిమట్టం!