తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న సన్నిధిలో ముస్లిం భక్తుడు.. ప్రతి యేటా కోడె మొక్కులు - Vemulawada temple news

Muslim devotee at Vemulawada temple: దైవ భక్తికి మతం అడ్డురాదని చాటిచెప్పారు ఓ ముస్లిం భక్తుడు. వేములవాడ రాజన్న.. హిందువులకే కాదు.. తనకూ ఇష్టదైవంగానే భావించారు ఆయన. అంతే కాదు ప్రతి యేటా క్రమం తప్పకుండా స్వామి వారి సన్నిధికి వస్తూ రాజన్నను దర్శించుకుంటున్నారు. కుటుంబసమేతంగా వచ్చి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి రోజూ భక్తులతో కిటకిటలాడే ఆ ఆలయంలో.. ఆ సన్నివేశం అక్కడున్నవారిని ఆకర్షించింది.

Muslim devotee at Vemulawada temple
వేములవాడ ఆలయంలో ముస్లిం భక్తుడు

By

Published : Mar 7, 2022, 4:50 PM IST

Muslim devotee at Vemulawada temple: వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తి పారవశ్యం విరాజిల్లుతోంది. సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి సోమవారం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కోడె మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లు కిటకిటలాడాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది.

కాగా హిందూ దేవుళ్ల ఆలయాలకు హిందువులు మాత్రమే తరలివస్తారని మనకు తెలిసిందే. కానీ ఓ ముస్లిం మాత్రం.. రాజన్నపై భక్తితో కొన్నేళ్లుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వరంగల్​కు చెందిన మహబూబ్.. ప్రతి యేటా కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రాజన్న సన్నిధికి వచ్చిన ఆ ముస్లిం భక్తుడు.. కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చదవండి:Telangana assembly sessions: ఈనెల 15 వరకు అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details