సిరిసిల్లలో ప్రశాంతంగా పోలింగ్ - election
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రశాంతంగా పోలింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. 77 పోలింగ్ కేంద్రాలను 460 మంది ఎన్నికల సిబ్బందిని అధికారులు నియమించారు. మండలంలో 14 ఎంపీటీసీల్లో ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా... మిగతా 12 స్థానాలకు 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జడ్పీటీసీ స్థానానికి ఐదుగురు పోటీలో నిలిచారు. ఎండ ప్రభావం వల్ల ఉదయం కన్నా పోలింగ్ శాతం తగ్గింది.