కొవిడ్ (Corona) మహమ్మారికి శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమేనని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ హైదరాబాద్‌లోనే(HYDERABAD) తయారవుతోందని మంత్రి వెల్లడించారు. అయితే 85 శాతం టీకాల(Vaccine) ఉత్పత్తిని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుందని.. టీకాల విషయంలో రాష్ట్రాల పాత్ర(Telangana) లేకుండా పోయిందని మంత్రి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల తిప్పాపూర్‌లో వంద పడకల ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు.
ktr: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోంది: కేటీఆర్ - తెలంగాణలో కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత తగ్గుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకవేళ వైరస్ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత తగ్గుతుందని.. ఒకవేళ వైరస్ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఇంటింటి సర్వే నిర్వహించామని తెలిపారు. కొవిడ్ చికిత్సకు కావాల్సిన అన్ని ఔషధాలను(Medicine) అందుబాటులో ఉంచామని మంత్రి వెల్లడించారు. ఆక్సిజన్ (Oxygen)కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బ్లాక్, వైట్ ఫంగస్‌కు సంబంధించిన ఔషధాలు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి:Lockdown: 99 శాతం మంది.. పోలీసులకు సహకరిస్తున్నారు: సీపీ