Minister KTR Distribute Double Bedroom Houses in Sircilla : వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ(Congress Six Guarantees)లను ఇస్తే ప్రజలు నమ్ముతారా అంటూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు(KTR) ప్రశ్నించారు. ఇలాంటి హామీలను ఇచ్చి జనాలను గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పని అని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 104 డబుల్ బెడ్రూం ఇళ్ల(Double Bed Room Houses) సముదాయానికి, బీసీ కాలనీలో 168 డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఒక్క రోజులోనే 4 గ్రామాల్లో 378 రెండు పడకల గదులు ప్రారంభించుకొని పంపిణీ చేసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పర్యటనలు ఈ మధ్య తక్కువ అయ్యాయని.. తనను ఎవరూ తిట్టుకోవద్దని స్థానిక ప్రజలను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.
KTR Comments on Six Guarantees of Congress :రాష్ట్రంలో 365 రోజులు మంచి నీరు, సాగు నీరు అందుబాటులో ఉండే విధంగా అప్పర్ మానేరులో నిల్వ చేసుకున్నామన్నారు. రైతుల దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు చేశారని కేటీఆర్ కొనియాడారు. రైతుల ఖాతాలో ఏకంగా రూ.73 వేల కోట్లు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని హర్షించారు. నేడు రైతు ఆదాయాన్ని పెంచామని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
Koppula Eshwar: డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్