రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేపట్టారు. ఆలయంలో దేవతలకు ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు. సాయంత్రం స్వామి వారి కల్యాణ మండపంలో మహాలింగార్చన పూజ నిర్వహించారు. 366 చిరు లింగాలను లింగాకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న సన్నిధిలో మహాలింగార్చన
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, మహాలింగార్చన పూజలు నిరివహించారు
వేములవాడ రాజన్న సన్నిధిలో మహాలింగార్చన