రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సంతోషిమాత ఆలయంలో ఈరోజు సంతోషిమాత జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు కుమారి పూజ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఆలయ నిర్వహకులు లగిశెట్టి శ్రీనివాస్ అనూష దంపతులు పురోహితుల సమక్షంలో చిన్నారులకు వాయినాలు ఇస్తూ వారి ఆశీర్వాదం పొందారు. చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషిమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వైభవంగా సంతోషిమాత జన్మదినోత్సవ వేడుకలు - తంగళ్ళపల్లి
సంతోషిమాత జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు దేవాలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలివచ్చి అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
వైభవంగా సంతోషిమాత జన్మదినోత్సవ వేడుకలు