తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం' - modern farmers bazaar in rajanna sirscilla

సిరిసిల్లలో ఆధునిక రైతుబజార్‌ను కేటీఆర్ ప్రారంభించారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని కేటీఆర్​ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు.

ktr-tour-in-siriscilla-district
'వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం'

By

Published : Jun 23, 2020, 1:11 PM IST

'వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం'

వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన కేటీఆర్... దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

అడ్డంకులు అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మించామని చెప్పారు. గోదాంల సామర్థ్యాన్ని 50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నారని వెల్లడించారు. కరోనా సంక్షోభంలోనూ రైతుల సంక్షేమాన్ని మరువలేదని స్పష్టం చేశారు. 5.60 లక్షలమంది రైతులకు రుణమాఫీ చేశామని వివరించారు. రైతుబంధు కింద 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,200 కోట్లు జమ చేశామని తెలిపారు. కరోనాతో చిరువ్యాపారులు ఇబ్బందిపడుతున్నారన్న కేటీఆర్​... రైతుబజార్​లో 223 మంది వ్యాపారం చేసుకునేలా దుకాణాలు నిర్మించామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details