కేసీఆర్ వల్లనే 4 వేల తండాలు గ్రామపంచాయతీలుగా ఆవిర్భవించాయని సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన... అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించి కార్మికులకు అండగా నిలవాలని సూచించారు. జిల్లాల పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ... పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలు చిన్నగా ఉంటే సంక్షేమ ఫలాలు వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్విరామ కృషితోనే తక్కువ కాలంలో కాళేశ్వరం ఫలాలు పొందుతున్నామన్నారు.
'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి' - zilla parishad general body meeting
పాలనా సౌలభ్యం కోసమే చిన్న జిల్లాలు ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. జిల్లాలుగా చిన్నగా ఉంటే సంక్షేమ ఫలాలు వేగంగా, పారదర్శకంగా అందుతాయని పేర్కొన్నారు.
'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'