తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Fires on Congress and BJP : 'కేసీఆర్​ను తిడితే ఓట్లు రావు.. ఇది ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలి' - KTR criticism of BJP latest news

KTR Fires on Congress and BJP : రాష్ట్రంలో 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని.. సీఎం కేసీఆర్.. 9 ఏళ్లలో చేసి చూపించారని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, ఆసరా పింఛన్ వంటి కార్యక్రమాలు రూపొందించి.. బీఆర్ఎస్ దేశానికే దిక్సూచిగా నిలిచిందని కేటీఆర్ వివరించారు.

Rajanna Sircilla
KTR

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 6:04 PM IST

KTR Fires on Congress and BJP at Rajanna Sircilla District :రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా.. ఈ కార్యాలయాలు నిలుస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తల భరోసా కోసం అన్ని జిల్లాల్లో వీటిని నిర్మించుకోవడం జరుగుతుందని.. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలోనూ కార్యాలయాలను నిర్మిస్తామని తెలిపారు.

KTR on Telangana Development : 50 ఏళ్లలో కాంగ్రెస్ (Congress) వాళ్లు చేయని అభివృద్ధిని.. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 సంవత్సరాలతో చేసి చూపించారని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, ఆసరా పింఛన్ వంటి కార్యక్రమాలను రూపొందించింది సీఎం మాత్రమేనని గుర్తు చేశారు. ఈ పథకాలను హస్తం పార్టీ, బీజేపీలు కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్​ను తిడితే ఓట్లు రావని.. ఇది ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.

KTR Comments on Congress and BJP : కాంగ్రెస్​ తరఫున గెలిచిన వాళ్లు.. బీజేపీలోకి జంప్‌ అవుతారు: మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో రెండు సార్లు రుణమాఫీ చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ మాటిస్తే చేస్తారని.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న 93 లక్షల తెల్లకార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా అందిస్తామన్నారు. ప్రతి రేషన్ కార్డుపై సన్నబియ్యం అందించడంతో పాటు.. ప్రతి ఆడబిడ్డకు రూ.400లకే సిలిండర్ అందజేయనున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో గ్యాస్ బండకు దండం పెట్టి.. బీజేపీకి డిపాజిట్లు గల్లంతు చేయాలని మహిళలకు కేటీఆర్ సూచించారు.

KTR Fires on Modi in Twitter : "బరాబర్​ మాది కుటుంబపార్టీయే.. రాష్ట్రమే మా కుటుంబం"

తెలంగాణలో సౌభాగ్య లక్ష్మీ పేరుతో మహిళలకు భరోసా, కేసీఆర్ఆరోగ్యరక్ష అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆత్మగౌరవానికి ప్రతీకని చెప్పారు. రానున్న 45 రోజులు.. మీరు మాకోసం పని చేస్తే.. వచ్చే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ సీఎం అయ్యేందుకు అందరూ కృషిచేయాలని కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

"తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిలుస్తాయి. ఈ కార్యాలయం కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా కార్యక్రమాలు చేయాలని జిల్లా పార్టీ నాయకత్వానికి సూచిస్తున్నా. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్.. 9 ఏళ్లలో చేసి చూపించారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ వంటి కార్యక్రమాలు రూపొందించి, బీఆర్ఎస్ దేశానికే దిక్చూచిగా నిలిచింది. రానున్న 45 రోజులు.. మీరు మాకోసం పని చేస్తే.. వచ్చే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తాం." - కేటీఆర్, మంత్రి

KTR Fires on Congress కేసీఆర్​ను తిడితే ఓట్లు రావు ఇది ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకోవాలి

KTR Speech at Kamareddy Public Meeting : ఆ కారణంతోనే కేసీఆర్‌.. కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నారు : కేటీఆర్

KTR on Hyderabad Development : 'హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా.. అందరికీ ఇబ్బంది కలుగుతుంది'

ABOUT THE AUTHOR

...view details