తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్గిల్​ దివాస్​ సందర్భంగా రిటైర్డ్​ జవాన్లకు సన్మానం! - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో కార్గిల్ లేక్ వైజయంతి యుద్ధ నౌక వద్ద అమర జవానులకు జోహార్లు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించి, రిటైర్డ్​ జవాన్లను సన్మానించారు.

Kargil vijay diwas celebrations in siricilla town
కార్గిల్​ దివాస్​ సందర్భంగా రిటైర్డ్​ జవాన్లకు సన్మానం!

By

Published : Jul 26, 2020, 9:30 PM IST

కార్గిల్​ దివాస్​ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్గిల్​ లేక్​ వైజయంతి యుద్ధనౌక వద్ద మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ ఆడెపు రవీందర్​ ఆధ్వర్యంలో కార్గిల్​ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించి.. పదవీ విరణ పొందిన జవాన్లను సన్మానించారు. 1999 ఫిబ్రవరిలో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పాకిస్తాన్​ ఉల్లంఘించి కాశ్మీర్​ను ఆక్రమించుకోవాలని కుట్ర చేసిందని, ఆ కుట్రను భారత సైన్యం తిప్పి కొట్టి 1999 మే 3న కార్గిల్​ యుద్ధం ప్రారంభమయిందని, సిరిసిల్ల మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ ఆడెపు రవీందర్​ తెలిపారు.

చలిలో, మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజులపాటూ జరిగిన యుద్ధంలో ఇరుదేశాల సైనికులు చాలామంది చనిపోయారని, 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని విజయం సాధించిందని ఆయన తెలిపారు. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ.. అమర జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటూ.. ప్రతిఏటా జూలై 26న కార్గిల్ విజయ దివస్ నిర్వహించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాగూర్ రాజ్​సింగ్, కౌన్సిలర్లు బోల్గం నాగరాజు, చెన్నమనేని కమలాకర్ రావు, పెద్దూర్ సింగిల్ విండో చైర్మన్ బర్కం వెంకటలక్ష్మి , నవీన్ యాదవ్, సీనియర్ నాయకులు గరిపెల్లి ప్రభాకర్, శీలం రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ABOUT THE AUTHOR

...view details