తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రగతి భవన్​ను ముట్టడిస్తాం' - కలెక్టర్​ కార్యాలయం

రాజన్న సిరిసిల్ల జిల్లా కందికట్కూర్​ను ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. మిడ్​మానేరు జలాశయానికి 150 మీటర్ల దూరంలో గ్రామం ఉండటం వల్ల పెనుప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించకపోతే కలెక్టర్​ కార్యాలయంతో పాటు ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

'ప్రగతి భవన్​ను ముట్టడిస్తాం'

By

Published : Aug 24, 2019, 7:01 PM IST

'ప్రగతి భవన్​ను ముట్టడిస్తాం'
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్​ను ముంపు గ్రామంగా ప్రకటించాలని మిడ్ మానేర్ తలుపుల వద్ద స్థానికులు ధర్నా చేపట్టారు. గత పదేళ్లుగా ముంపు గ్రామంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. 26 టీఎంసీల సామర్థ్యం గల మిడ్ మానేరులో 9 టీఎంసీల నీటి నిలువతో నీటి ఉధృతి తీవ్రంగా ఉండి.. గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జలాశయం కింద 150 మీటర్ల దూరంలోనే గ్రామం ఉండడం వల్ల పెనుప్రమాదం వాటిల్లుతుందని వాపోయారు. ముంపు గ్రామంగా ప్రకటించకపోతే కలెక్టర్​ కార్యాలయంతో పాటు ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details