కాళేశ్వరంతో సాగునీటి రంగానికి కొత్తజీవం - kaleswaram water reached to midmaneru
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రైతులకు చేరువవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగు నుంచి రామప్ప వరకు నీరు చేరడంతో గోపాల్రావుపల్లె వద్ద గోదావరికి హారతి ఇచ్చారు.
తెలంగాణలో సాగునీటి రంగానికి కొత్త జీవం పోస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయానికి నీరు చేరింది. మానేరు వాగు నుంచి నీరు రామప్ప వరకు చేరడంతో ఆ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావు పల్లె వద్ద తెరాస మండల శాఖ అధ్యక్షులు అంకారపు రవీందర్ గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
- ఇదీ చూడండి : ఆరేళ్ల కనిష్ఠానికి దేశ వృద్ధి రేటు.. 5 శాతంగా నమోదు
TAGGED:
srcl