తెలంగాణ

telangana

ETV Bharat / state

14రోజుల్లో రాజన్న హుండీ ఆదాయం 69 లక్షలు - రాజరాజేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీ లెక్కించారు. గత 14 రోజులకు సంబంధించి సుమారు 69లక్షల నగదు, బంగారు లభించింది.

రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు
14రోజుల్లో రాజన్న హుండీ ఆదాయం 69 లక్షలు

By

Published : Sep 30, 2020, 6:41 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలోని హుండీని మంగళవారం లెక్కించారు. రూ. 68,91,884 నగదు, 110 గ్రాముల బంగారం, 4.5కిలోల వెండి భక్తులు సమర్పించుకున్నారు.

హుండీ లెక్కింపు కోసం ఆలయ ఓపెన్ స్లాబ్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. లెక్కింపు నిర్వహించారు.

ఇదీ చూడండి:రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details