రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఆలయంలోని 32 హుండీల లెక్కింపును నిర్వహించారు. కొంత మంది భక్తులు బంగారం, వెండి వస్తువులనూ హుండీలో వేశారు. ఉదయం ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ ప్రక్రియలో పలు సేవా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు - రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని 32 హుండీల లెక్కింపు చేపట్టారు.
రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు