తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై వినూత్న పెయింటింగ్ - కరోనాపై భారీ చిత్రం

సిరిసిల్ల చిత్రకారుల సంఘం ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో సిరిసిల్ల పట్టణం అంబేడ్కర్​ చౌరస్తాలో చిత్రకళా ప్రదర్శను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ లాక్​డౌన్​ను అనుసరించాలని చిత్రకళాకారులు సూచించారు. ఆ చిత్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదివారం సాయంత్రం సందర్శించారు.

Huge painting on Corona at rajanna sircilla
కరోనాపై వినూత్న పెయింటింగ్

By

Published : Apr 12, 2020, 7:35 PM IST

సిరిసిల్ల పట్టణం అంబేడ్కర్​ చౌరస్తాలో చిత్రకళా కార్మిక సంఘం కళాకారులు కరోనాపై భారీ పెయింటింగ్ వేశారు. కొవిడ్​-19పై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు చిత్రీకరించిన ఆ చిత్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. పెయింటింగ్ అర్థవంతంగా ఉందంటూ కళాకారులను అభినందించారు. కరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో భాగస్వాములైన ఉద్యోగుల సేవలను ప్రశంసించారు.

లాక్​డౌన్ ముగిసేవరకు ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి జరగకుండా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ కళ, కమిషనర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :వికారాబాద్​ జిల్లాలో మరో 11 మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details