రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని అనంతగిరి ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు మూడు రోజుల్లోగా పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ గుత్తేదారులను ఆదేశించారు. అనంతగిరి ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 109 ఇళ్ల నిర్మాణ ప్రగతిని, కాలనీలో చేపడుతున్న మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎన్ ఖీమ్యా నాయక్, మండల అధికారి శ్రీనివాస రావులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతిని పరిశీలించారు.
'ఇళ్ల నిర్మాణం మూడు రోజుల్లో పూర్తి చేయాలి' - రాజన్న సిరిసిల్ల తాజా వార్త
రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంటలో అనంతగిరి ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు.
ఇళ్లు, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. కాళేశ్వరం జలాలు అతి త్వరలో అనంతగిరి ప్రాజెక్టులోకి రానున్నందున ఇళ్ల నిర్మాణ పనులు మౌలిక వసతులు పూర్తి చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ఇంజినీరింగ్ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని సదుపాయాలతో కాలనీ ఏర్పాటు చేస్తేనే వెళ్లడానికి అంగీకరిస్తామని అనంతగిరి గ్రామస్థులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి