తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షం... మానేరుకు చేరుతున్న వరద - Heavy rain in wemulawada

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో గత రాత్రి నుంచి వర్షం భారీగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు నిండి అలుగు పారుతున్నాయి. మూలవాగు నుంచి మధ్య మానేరుకు పెద్దఎత్తున వరద చేరుతోంది.

Heavy rain flood approaching middle Manor at vemulawada sircilla district
భారీ వర్షం... మానేరుకు చేరుతున్న వరద

By

Published : Aug 10, 2020, 4:47 PM IST

Updated : Aug 10, 2020, 4:55 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లోనూ భారీ వర్షం కురవడం వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

పట్టణంలోని మూలవాగుకు భారీ వరద చేరటం వల్ల వాగు నుంచి మధ్య మానేరుకు పెద్ద మొత్తంలో నీరు వెళ్తోంది. గ్రామీణ మండలంలోని హనుమాజీపేట వద్ద నక్కవాగు పొంగి పొర్లుతోంది. ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.

భారీ వర్షం... మానేరుకు చేరుతున్న వరద

ఇదీ చూడండి :రానున్న రోజుల్లో తెరాస కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుంది : బండి

Last Updated : Aug 10, 2020, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details